Sunday, 8 April 2018

परिचयः పరిచయం

"సంభవామి యుగే యుగే" అని ధర్మగ్లానిని ఆపటానికి పరమాత్మ అవతరిస్తానని మాటిచ్చాడు. ఆయన దానితోపాటు తన కార్యాన్ని సానుకూలం చేసుకునేందుకు ఇంకో యుక్తి చేస్తాడు. కొందరిని ఎంచుకుంటాడు. వారు ధర్మరాజులా అకారణంగా ధర్మాన్ని ఆచరిస్తూ, బోధిస్తూ తిరుగుతుంటారు. వారి సంపర్కంలోకి వచ్చినవారంతా ఆ మేలు పొందుతుూ మార్గనిర్దేశనం పొందుతుంటారు. 
అట్టివారిలో ఒకరు తెలుగువారి భాగ్యాన వచ్చినవారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.
ఆయన వ్రాతలను వీలైనప్పుడల్లా హిందీలోకి అనువదించి ఉంచుకుంటున్నాను. వాటినే ఒక బ్లాగు చేయాలనిపించింది. చేసి ఇక్కడ హిందీ వచ్చినవారి కోసం పంచుతున్నాను. చదివి ఆనందించి విజ్ఞానం పొంది మీరూ ఆ వెలుగును నలుగురికి పంచగలరు.

https://arshavijnanam.blogspot.in/
తెలుగు మూలం వివరాలు- 
గ్రంథః- “ఏష ధర్మః సనాతనః”-
గ్రంథకారః- శ్రీ షణ్ముఖశర్మా సామవేదమ్
ఋషిపీఠం ప్రచురణ, మూడవ ముద్రణ, 2016,
వెల-300రూ.,
సంపర్కసంఖ్య- 040-2713 4557

దాదాపు 600 పేజీల పుస్తకం. ప్రతి లేఖనం ఒకటిన్నర నుండి రెండు పుటలుంటుంది. మొత్తం కలిపి ఓ 200+ లేఖనాలున్నవి.
 
నేను స్వయంగా ఇంతటి మహత్తర విషయాలను వ్రాయలేను. వ్రాసినవారివి అనువదించి ఆనందించగలను. 
వీలును బట్టి మరిన్ని తెలుగు సద్గ్రంథాలను  హిందీ చేసి ఇక్కడ పెట్టాలని ఆకాంక్ష. అట్టి వ్రాతకారులకు నమో వాకములతో,
-సంకా ఉషారాణి

No comments:

Post a Comment